గ్రామీ అవార్డ్స్ లో సత్తా చాటిన భారత్

zakir hussain and shankar mahadevans band won grammy award

మన ఇండియన్ సినిమాలు ఇప్పుడు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు గ్రామీ అవార్డుల్లో సైతం తమ ప్రతిభను చాటుకుంది భారత్. అంతర్జాతీయ అవార్డ్స్ లో గ్రామీ అవార్డ్స్ కు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే కదా. సంగీతంలో సాధించిన విజయాలను గుర్తించడానికి గాను ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవం నిన్న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సంగీత కళాకారులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అవార్డ్ కార్యక్రమంలో భారత్ కు కూడా పలు అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ సంగీత దిగ్గజాలైన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ లు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ ఆల్బమ్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఆల్బమ్ ను జాన్ మెక్​లాగ్లిన్ (గిటార్​), జాకీర్ హుస్సేన్​(తబ్లా), శంకర్​మహదేవన్​(సింగర్​), వి సెల్వగనేశ్​, గనేశ్​రాజాగోపాలన్​(వయోలిన్​) ఇలా మొత్తం 8 మంది కలిసి కంపోజ్ చేశారు. ఇక శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ బృందం సభ్యులు లాస్ ఏంజెల్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అవార్డును అందుకున్నారు. దీంతో వీరిపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. నరేంద్ర మోడీ సైతం తన ట్విట్టర్ ద్వారా ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =