ఈగల్ లో నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను – రవితేజ

Mass Maharaja Ravi Teja Interesting Comments on His Makeover in Eagle

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని దాదాపు నటీనటీనటులతో పని చేయడం ఇదే తొలిసారి. నవదీప్‌కు బలమైన క్యారెక్టర్‌ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో తనకి మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఎవరూ ఊహించలేని విధంగా డైలాగ్స్‌ చెప్పాడు. ఇద్దరం కలిసి ఓ కామెడీ సినిమాలో చేయాలని వుంది. తనలో చాలా మంచి హ్యుమర్ వుంది. శ్రీనివాస్ రెడ్డి, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్.. అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మాస్టర్ ద్రువన్ పాత్రతో చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “డేవ్ జాండ్.. రాక్ స్టార్. అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. తను భవిష్యత్ లో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. మణి చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. విశ్వ ప్రసాద్ గారు, వివేక్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటింది. ఈ ప్రొడక్షన్‌లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే. అంత కంఫర్ట్ వుంటుంది. విశ్వ ప్రసాద్ గారు చాలా క్లియర్ గా వుంటారు. వున్నది వున్నట్లుగా మాట్లాడతారు. క్లియర్ గా వుంటారు కాబట్టి నాకు నచ్చుతారు. ఎందుకంటే నేను క్లియర్ గా వుంటాను. విశ్వ ప్రసాద్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్” అని చెప్పారు.

“అనుపమ పాత్రే ఈ సినిమా కథను నడిపిస్తుంది. కావ్య లవ్లీ క్యారెక్టర్ చేసింది. డైరెక్టర్ కార్తిక్ కి విపరీతమైన క్లారిటీ వుంది. ఎక్స్ ట్రార్డినరీ గా తీశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్ లో కనిపిస్తాను. ఈ గెటప్ రావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఫస్ట్ టైం ఇలాంటి మేకోవర్. అందరిలానే నేను ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాను. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో కలుద్దాం. జై సినిమా” అని హీరో రవితేజ పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =