టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘టైటిల్ లుక్‌ను రివీల్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు టీజర్‌లకు నెట్టింట మంచి అప్లాజ్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఈ టీజర్‌లో విజయ్ దేవరకొండ ‘ఐరనే వంచాలా ఏంటి?’ అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నందనందన’ లిరికల్ ప్రోమో రిలీజ్ చేసింది. రేపు (ఫిబ్రవరి 07, 2024) ‘నందనందన’ ఫుల్ లిరికల్ సాంగ్ రాబోతోందని అనౌన్స్ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో దీనిని ఖరారు చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
Starting the musical adventure of #FamilyStar with a mesmerizing melody ❤️🔥#Nandanandanaa Promo out now 💥https://t.co/fpR6H8FDYZ
Full Song will sweep you off your feet on Feb 7th ❤️@TheDeverakonda @mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official…
— Sri Venkateswara Creations (@SVC_official) February 5, 2024
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. ప్రముఖ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారని టీమ్ వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ అద్భుతమైన క్యాచీ ట్యూన్ ఇచ్చారని ఈ ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. ఇక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన పెద్దఎత్తున విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: