టిల్లు స్క్వేర్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలావుంది

Tillu Square Glimpse gets extraordinary response

డీజే టిల్లు తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.రెండేళ్ల క్రితం విడుదలైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతుంది.టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో వస్తున్నఈసినిమాలో సిద్దుకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈసినిమానుండి నిన్న సిద్దూ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ  గ్లింప్స్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు.డీజే టిల్లు లో ఏం జరిగిందో సిద్దు,అనుపమాకు తన స్టయిల్లో చెప్పడం అదో మల్కాజిగిరి పాన్ ఇండియా మూవీ అనడం ఇవన్నీ బాగా పేలాయి.24గంటల్లోనే ఈగ్లింప్స్ 7మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టిందంటే హైప్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు.మొత్తానికి గ్లింప్స్ తో సాలిడ్ ఇంప్రెషన్ క్రీయేట్ అయ్యింది.సినిమా కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేయగలిగితే 100కోట్లు కొట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

ఈనెల14న ట్రైలర్ కూడా విడుదలకానుంది.ఈసినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తుండగా మార్చి 29న టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 7 =