గామి అద్భుతమైన అనుభూతిని పంచుతుంది- విశ్వక్ సేన్

vishwak sen shares interesting facts about gaami movie

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌, విద్యాధర్ కాగిట దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ గా ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. వారణాసిలో ‘గామి’ షూటింగ్ చేస్తున్నపుడు ఫోన్ లో ఫలక్ నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడిని. దర్శకుడు విద్యాధర్ గామి కోసం చాలా రిసెర్చ్ చేశాడు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సమయం పడుతుందని తెలుసు. దాదాపు నాలుగున్నరెళ్ళు పాటు చేశాం. ఇంత సమయం ఇచ్చాము కాబట్టే మంచి సీజీని రాబట్టుకున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే అవేమీ గుర్తు లేవు. అయితే నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరు నేను అఘోర అనుకోని ధర్మం చేశారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలకూర్చున్నప్పుడు ఓ మూసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. సినిమా ట్రైలర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ గా వుంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందనే నమ్మకం వుంది. గామి మార్చి 8న విడుదలౌతుంది. ఖచ్చితంగా అందరినీ సరికొత్తగా అలరిస్తుందని అన్నారు.

కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నరేష్ కుమారన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − ten =