మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ భారీగా చేశారు.హైప్ కూడా వచ్చింది.రవితేజ అయితే సినిమా విజయం ఫై కాన్ఫిడెంట్ గా వున్నాడు.బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దది ఏం కాదు.23కోట్ల షేర్ రాబడితే చాలు.హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ కేక్ వాకే. ముఖ్యంగా సినిమాలో చివరి 40నిమిషాలు అదిరిపోయిందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు ఎప్పుడు చూడని యాక్షన్ సీక్వెన్స్ తో థ్రిల్ ఇవ్వనుందని టాక్.మరి ఇది గాని వర్కౌట్ అయితే హిట్ టాక్ వచ్చినట్లే.రవితేజకు కూడా హిట్ కొట్టి ట్రాక్ లోకి రావడానికి ఈగల్ మంచి ఆప్షన్ కానుంది.కార్తీక్ ఘట్టమనేని ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.డైరెక్టర్ గా అతినికిదే మొదటి సినిమా.అనుపమా పరమేశ్వరన్ ,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా నవదీప్,మధుబాల కీలక పాత్రలు పోషించారు.దేవ్ జాన్డ్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
ఇక తెలుగుతోపాటు ఈగల్ హిందీ లో కూడా రేపే విడుదలవుతుంది.కాకపోతే హిందీలో సహదేవ్ గా వస్తుంది.రవితేజ కు హిందీ లో మంచి మార్కెట్ వుంది.దాంతో హిందీ మార్కెట్ పై కన్నేశాడు.ఇంతకుముందు టైగర్ నాగేశ్వర్ రావుతో ట్రై చేశాడు కానీ అది అంత వర్కౌట్ కాలేదు మరి సహదేవ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: