భీమా ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ ప్రోమో రిలీజ్

gopichand bhimaa movie first single yedo yedo maaya song promo out

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు పాటలను రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ అనే పాట ప్రోమో ను రిలీజ్ చేశారు. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. మెలోడియస్ బీట్ తో సాగిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 14 =