టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గుంటూరు కారం’ అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్‌కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది. దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే గుంటూరు కారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వేచిచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 09, 2024) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రంలో కొత్త మహేష్ బాబును చూశారు ప్రేక్షకులు. ఆయన డైలాగ్ డెలివరీ, స్లాంగ్, డ్యాన్స్.. ఇలా అన్నింటిలో మహేష్ ఇరగదీశాడని ఫ్యాన్స్ అంటున్నారు.
ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ అయితే గత కొన్ని వారాలుగా నెట్టింటిని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్‌గా ఈ ఊరమాస్ సాంగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కు పైగా రీల్స్ చేశారంటే దీనిపై ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అలాగే జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
కాగా మరోవైపు మహేశ్ బాబు తదుపరి సినిమా దర్శక ధీరుడు రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. #ఎస్‌ఎస్‌ఎంబీ29గా వ్యవహరిస్తున్న ఈ పాన్ గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ సినిమా కోసం మహేశ్ ఇటీవలే స్పెషల్ ఫిట్‍నెస్ ట్రైనింగ్ తీసుకోవడానికి జర్మనీకి వెళ్లి వచ్చారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: