నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే విలేజ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్టు కూడా తెలిపారు మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా తన ట్విట్టర్ ద్వారా మరో అప్ డేట్ ఇచ్చాడు చందూ మొండేటి. తండేల్ సెట్ లో తాను ఇంకా నాగచైతన్య ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ తండేల్ రాజు డెడికేషన్ తెరపై చూడాల్సిందే అంటూ పోస్ట్ లోరాసుకొచ్చారు. ఈ ఫొటో అయితే అందరినీ ఆకట్టుకుంటుంది.
Director @chandoomondeti shares a picture from the sets of #Thandel and is full of appreciation for Yuvasamrat @chay_akkineni‘s dedication ❤️🔥#Dhullakotteyala 🔥🔥@Sai_Pallavi92 @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli pic.twitter.com/l5ADtuMTlQ
— Thandel (@ThandelTheMovie) February 7, 2024
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: