టాలీవుడ్ కమెడియన్స్‌లో ‘వెన్నెల’ కిశోర్ శైలి డిఫరెంట్. సినిమాల్లో కథానాయకుడి పాత్రధారి పైనా సెటైర్స్ వేయగల స్థాయి ఉన్న నటుడు ఆయన. అమాయకత్వం, వ్యంగ్యం కలగలిసిన వినోదానికి వెన్నెల కిశోర్ కేరాఫ్ అడ్రస్. తన డిఫరెంట్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతారు. ఇక ఇదిలా ఉండగా.. వెన్నెల కిశోర్ ఇటీవలే వెన్నెల కిశోర్ తేజ సజ్జా హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’లో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ఆయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మరియు ‘ఇండియన్ 2’ సినిమాలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వెన్నెల కిశోర్ కేవలం హాస్య నటుడిగా మాత్రమే కాదు, తనకు సరిపోయే క్యారెక్టర్లు వచ్చినప్పుడు కథానాయకుడిగానూ చేస్తుంటారు. ఈ క్రమంలో వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చారి 111’. ఈ చిత్రాన్ని బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తుండగా.. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తుండగా.. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ స్పై గా నటిస్తుండటం విశేషం.
తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. కంప్లీట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ‘చారి 111’లో ఓ సీరియస్ కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండబోతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడం, ఆ కేసును పరిష్కరించడానికి కన్‌ఫ్యూజ్డ్ స్పై చారి (వెన్నెల కిశోర్) రావడం, ఆ కేసును చారి తనదైన స్టైల్‌లో ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా.
కాగా ఈ సినిమాలో.. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. కరుణాకర్ స్టంట్స్ రూపొందించారు. ఇక అక్షత బి హొసూరు ప్రొడక్షన్ డిజైన్ చేయగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్య సహకారం అందించారు. అలాగే సినిమాటోగ్రాఫర్ గా కషిష్ గ్రోవర్.. సంగీత దర్శకుడిగా సైమన్ కె కింగ్ పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: