జయంరవి సైరెన్ ట్రైలర్ రిలీజ్

jayam ravi siren movie trailer out now

ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం చూశాం. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు జ‌యం ర‌వి. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత తను ఎవరిపై పగ తీర్చుకున్నాడు అనేది కథాంశంలా కనిపిస్తుంది. మరి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, తులసి పలు పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =