బ‌ల‌గం డైరెక్టర్ వేణు యెల్దండి ఎమోష‌న‌ల్ పోస్ట్

Balagam Director Venu Yeldandi Emotional Post on His Father Goes Viral

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు వారసులైన హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌, శిరీష్‌ సమర్పణలో నిర్మించిన సినిమా ‘బలగం’. బర్దస్త్‌ షో సహా పలు సినిమాలలో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో వేణు ఒక క్యామియో రోల్‌లో కనిపించగా.. మురళీధర్ గౌడ్‌, జయరామ్‌, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతేడాది మార్చి 3న చిన్న సినిమాగా రిలీజై ఘనవిజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వ‌చ్చిన ఈ చిత్రంపై తాజాగా దర్శకుడు వేణు యెల్దండి ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు నేడు తన తండ్రి వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా వేణు భావోద్వేగ ట్వీట్ చేశారు. అందులో.. “నా ‘బ‌ల‌గం’ సినిమా అందరూ చూశారు.. మా నాన్న తప్ప. మిస్ యూ నాయిన‌” అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా వేణు స్వయంగా కథ రాసుకుని, తెరకెక్కించిన బలగం సినిమా ప్రేక్షకుల మన్ననలే కాకుండా అనేక అవార్డులను సైతం గెలుచుకుంది. దీనిలో భాగంగా పలు జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు అందుకున్నది. ఉగాది బెస్ట్ ఫిల్మ్‌గా నంది అవార్డ్ అందుకున్న బలగం మూవీ.. అనంతరం పలు అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తా చాటింది. ఈ క్రమంలో 100కి పైగా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుని మరే ఇతర తెలుగు సినిమాకీ సాధ్యం కానీ రికార్డ్ సృషించింది. అలాగే ‘ఇంట‌ర్నేష‌న‌ల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌’లో ‘బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ ఫీచ‌ర్‌’ క్యాట‌గిరీలో బలగం సినిమా బరిలో నిలిచింది. ఇక వేణు సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెల్లడి కావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =