యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల తేదీ మరో సారి మారనుంది.గత ఏడాది చివర్లోనే ఈసినిమాను విడుదలచేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ అప్పటికీ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది.ఇక శివరాత్రికి మార్చి 8న విడుదలచేస్తామని రీసెంట్ గా అనౌన్స్ చేశారు.ఇక ఇప్పుడు ఈడేట్ కు కూడా రావడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదే డేట్ కు విశ్వక్ సేన్ నటించిన మరో సినిమా గామి రానుంది.దాంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల వాయిదాపడింది అయితే ఇదొక్కటే కారణం కాదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వర్క్స్ కూడా పెండింగ్ లోనే వున్నాయట దాంతో గామితో ఆ డేట్ కు వస్తున్నాని విశ్వక్ సేన్ తెలిపాడు.
ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏప్రిల్ లేదా మే లో విడుదలయ్యే ఛాన్స్ వుంది.రూరల్ బ్యాక్ డ్రాప్ లో చైతన్య కృష్ణ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన సాంగ్ చార్ట్ బాస్టర్ అయ్యింది.సితార ఎంటెర్టైన్మెంట్స్,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: