టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు ఇంట త్వరలో శుభకార్యం జరగబోతునున్న విషయం తెలిసిందే. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు, యంగ్ హీరో ఆశిష్ వివాహం ఈ నెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు గత వారం రోజులుగా సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు కుటుంబసభ్యులు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు శిరీష్, ఆశిష్ మరియు దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి చరణ్ ఇంటికి వెళ్లి శుభలేఖ అందజేశారు. ఈ సందర్భంగా తమ ఇంట జరుగనున్న వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆయనను వారు ఆహ్వానించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైతా రెడ్డితో ఆశిష్ రెడ్డి వివాహం ఫిబ్రవరి 14న జరుగనుంది. జైపూర్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్న ఈవెంట్‌లో వివాహ బంధంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. గతేడాది నవంబర్ 30న వీరి నిశ్చితార్థం జరిగింది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, రవితేజ తదితరులకు ఆహ్వానాలు అందాయి. అలాగే పొలిటీషియన్స్ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు, ఇంకా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరుల ఇళ్లకు దిల్ రాజు కుటుంబంతో సహా వెళ్లి వ్యక్తిగతంగా శుభలేఖలు అందజేసి వివాహానికి ఆహ్వానించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: