
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 202


తమన్నా ఓదెల2 షూటింగ్ మొదలు

హాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న దృశ్యం

గామి ట్రైలర్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు 18 మూవీ

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం

నెట్ ఫ్లిక్స్ చేతికి విజయ్ ది గోట్

నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా సారీ

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు

గామి ఆడియెన్స్‌లో ఆ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది - డైరెక్టర్ విద్యాధర్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. అభినయ, హారిక, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గామి' చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

తమన్నా ఓదెల2 షూటింగ్ మొదలు
అశోక్ తేజ దర్శకత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వేస్టేషన్ అనే థ్రిల్లర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించాడు. 2022 లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు ఓదెల2 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

హాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న దృశ్యం
భారతీయ సినిమాలకు ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. దేశీయ మూలాల నేపథ్యంతో రూపొందిన కథలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. మేకర్స్ సైతం కొత్త తరహా కథలతో మూవీలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ప్రఖ్యాత 'ఆస్కార్' పురస్కారాన్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక భారతీయ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘దృశ్యం’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ -ఆపరేషన్ సక్సెస్
ఓవరాల్ గా ఆపరేషన్ వాలైంటైన్ ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది.వరుణ్ తేజ్ నటన ,విజువల్స్ ,ప్రీ క్లైమ్యాక్స్ ,క్లైమ్యాక్స్ ,డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.వార్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ ఆపరేషన్ వాలెంటైన్ బాగా నచ్చుతుంది.

గామి ట్రైలర్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంత యాక్టీవ్ గా ఉండడు కానీ తనకు ఏదైనా సినిమా నచ్చితే మాత్రం వెంటనే ఆ సినిమా గురించి పోస్ట్ చేయడం చూస్తుంటాం. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంబంధించి ప్రభాస్ పోస్ట్ లు పెట్టగా.. తాజాగా మరో సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. ఆసినిమా మరేదో కాదు విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గామి. విధ్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుంది. మార్చి 8వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సందీప్ రెడ్డి వంగా.. తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేశాడు - విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి. వచ్చే శుక్రవారం రోజు (మార్చి 8)న 'గామి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షోరీల్ ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

'గామి'.. థియేటర్స్‌లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది - సందీప్ రెడ్డి వంగా
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీతో విశ్వక్ సేన్ పక్కాగా హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు క్యూరియాసిటీ పెంచేశాయి.

విశ్వక్ సేన్ గామి ట్రైలర్ రిలీజ్
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా
కోలీవుడ్ లో ప్రస్తుతం ఓ మలయాళ సినిమా డామినేషన్ కొనసాగుతుంది.గత వారం మంజిమ్మల్ బాయ్స్ అనే సినిమా విడుదలైయింది.చిన్న సినిమా గా వచ్చిన ఈసినిమా అదిరిపోయే టాక్ తో ఇప్పటివరకు 2కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారాంతం కల్లా మరో రెండు కోట్లను ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దాంతో తమిళనాడులో బిగ్గెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 10కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు.పైగా అక్కడ ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా విడుదలకావడం లేదు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు 18 మూవీ
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగులో బిజీ అవుతున్న బిగ్ బాస్ 17 ఫేమ్ అయేషా ఖాన్
బిగ్ బాస్ 17ఫేమ్ అయేషా ఖాన్ తెలుగులో బిజీ అవుతుంది.ముఖచిత్రం అనే సినిమాతో తెలుగులోకి రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చినా ఈసినిమా తనకు కావాల్సిన గుర్తింపు ను తీసుకురాలేకపోయింది.దాంతో ఆఫర్లు లేక గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇటీవల బిగ్ బాస్ 17 పుణ్యమా అని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి.అందులో భాగంగా శ్రీ విష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ లో అయేషా ఓ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా మార్చి 22న విడుదలవుతుంది.హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి ఈసినిమాను తెరకెక్కించగా యూవీ సెల్యులాయిడ్ నిర్మిస్తుంది.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా-రణ్‌వీర్ జంట
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా దీపిక పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ప్రెగ్నెంట్' అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అందులో వెల్లడించారు.

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం
మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రేపు రానుంది.ఈసినిమాకు బజ్ కూడా బాగానే వుంది.ఇండస్ట్రీ సర్కిల్ నుండి టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుంది.ఇక ఈసినిమా చాలా తక్కువ రన్ టైం తో రానుంది.యు/ఏ సర్టిఫికెట్ తో కేవలం 2గంటల నిడివి తో థియేటర్లలోకి రానుంది.పుల్వామా ఘటనకు ఏవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే కథతో తెరకెక్కింది ఈసినిమా.మానుషీ చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సోనీ పిక్చర్స్ నిర్మించింది.

నెట్ ఫ్లిక్స్ చేతికి విజయ్ ది గోట్
లియోతో గత ఏడాది కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దళపతి విజయ్ ప్రస్తుతం తన 68వ సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)లో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా సారీ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడిన మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే కదా. దానిపై ఇప్పటికే వరుణ్ సైతం క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఇంకా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా నాగబాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సారీ చెప్పారు. ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను…

ఆపరేషన్ వాలెంటైన్ నుండి ప్రభవించే సాంగ్ రిలీజ్
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభవించే అంటూ వచ్చే నాలుగో పాటను రిలీజ్ చేశారు.

శ్రీ అమృతేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాజమౌళి దంపతులు
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలతో ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గత చిత్రం 'ఆర్ ఆర్ఆర్' అయితే అమెరికా, జపాన్ సహా అనేక దేశాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే పట్టాలెక్కనుంది.

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇక గత ఏడాది సామజవరగమన అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఈగల్ అమెజాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈసినిమా పోటీ నుండి తప్పుకొని సింగిల్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకొని ఫైనల్ గా ఫిబ్రవరి9వ తేదీన రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రవితేజ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది.