
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 199


హనుమాన్ యూఎస్ ఫైనల్ కలెక్షన్స్

తండ్రైన టాలీవుడ్ హీరో శర్వానంద్

ఓం భీమ్ బుష్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

భీమా సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం ఎంతంటే

ప్రేమలు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు

లవ్ మీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పూజా కార్యక్రమాలతో శర్వా 36 గ్రాండ్ లాంచ్

గామి పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్

దేవర- తంగం కు టీమ్ బర్త్ డే విషెస్

అఫీషియల్.. రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్

శర్వా 35 టైటిల్ రిలీజ్

ఆయ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.

ధనుష్-నాగార్జున మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు మేకర్స్.

హనుమాన్ యూఎస్ ఫైనల్ కలెక్షన్స్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను దుల్లగొట్టింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక ఈసినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈమేరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి8వ తేదీన ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తండ్రైన టాలీవుడ్ హీరో శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ గత ఏడాది వివాహబంధం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో శర్వా వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు శర్వా మరో కొత్త బాధ్యతలోకి అడుగుపెట్టాడు. శర్వా పుట్టినరోజు సందర్బంగా ఒక గుడ్ న్యూస్ ను అందరితో పంచుకున్నాడు. తను తండ్రైనట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్బంగా తాను, భార్య ఇంకా పాప ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. అంతేకాదు పేరు ను అప్పుడే ప్రకటించేశాడు. పాపకు లీలా దేవి అనే పేరును పెట్టారు.

శర్వా37 మూవీ- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
నేడు శర్వానంద్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన సినిమాల నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శర్వా 35 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా టైటిల్ ను ఈరోజు ఉదయాన్నే రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇకా శర్వా 36వ సినిమా అప్ డేట్ కూడా వచ్చింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను పూజాకార్యక్రమాలతో లాంచ్ చేశారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈసినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఓం భీమ్ బుష్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

భీమా సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం ఎంతంటే
మ్యాచో హీరో గోపిచంద్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం భీమా.శివరాత్రి రోజు విడుదలవుతుంది.అందులో భాగంగా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.ఫైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సర్టిఫికెట్ వచినట్లు తెలుస్తుంది.ఇక రన్ టైం విషయానికి వస్తే 143 నిమిషాల 43 సెకండ్ల్ నిడివి తో థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై గోపిచంద్ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.భీమా విజయం తన కెరీర్ కు కీలకం కానుంది.

కల్కి 2898AD- ఇటలీలో ఆటా పాటా
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఆదిశగానే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈనేపథ్యంలో ఇటలీలో ఆటాపాటా అంటూ చిత్రయూనిట్ ఒక ఫొటోను కూడా…

ప్రేమలు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు
గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అయ్యింది ప్రేమలు. చిన్న సినిమాగా వచ్చి నిన్నటి వరకు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో ఈఫీట్ సాధించిన 5వ మలయాళ సినిమా గా రికార్డు క్రీయేట్ చేసింది.ఇక ఈసినిమాకు రెస్పాన్స్ చూసి అదే టైటిల్ తో తెలుగు లోను విడుదలచేస్తున్నారు.

లవ్ మీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ రెడ్డి దిల్ రాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తొలి సినిమా 'రౌడీ బాయ్స్'తో యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న ఆశిష్.. రెండో సినిమాగా 'సెల్ఫిష్' అనే చిత్రం చేశాడు. ఇక ఇటీవలే అద్వైతా రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడైన ఆయన తాజాగా నటించిన మూడో సినిమా 'లవ్ మీ'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు.

పూజా కార్యక్రమాలతో శర్వా 36 గ్రాండ్ లాంచ్
యంగ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వరుసగా వస్తున్నాయి. నేడు శర్వా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అప్ డేట్లు ఇస్తున్నారు. ఇప్పటికే శర్వా 35 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇక నేడు ఈసినిమా టైటిల్ రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ న జరుపుకుంటుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.గత నెలలో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈసినిమా ఇప్పటివరకు 4.9 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది దాంతో ఈ ఏడాది అత్యధిక వ్యూస్ ను సాధించిన మొదటి సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.దీని తరువాత స్థానంలో4.2 మిలియన్ వ్యూస్ తో హాయ్ నాన్న ఉండగా సలార్ 3.5మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో కొనసాగుతుంది.అయితే సలార్ సౌత్ వెర్షన్ లు మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వున్నాయి.హిందీ వెర్షన్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది దాంతో తక్కువ వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది లేకుంటే మొదటి స్థానంలో ఉండేది.

భ్రమయుగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా భ్రమయుగం. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ గా ఈసినిమాను రూపొందించారు. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వంతో తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

గామి పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

'గామి' కథ, పెర్ఫామెన్స్, విజువల్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నారు.

దేవర- తంగం కు టీమ్ బర్త్ డే విషెస్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 5న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. అక్టోబర్ 10 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా ముగించుకుంటుంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది నుండి రెంట్ కి డబ్బు లేదు సాంగ్ రిలీజ్
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.నిజానికి ఈసినిమాను మార్చి 22వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సివచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

అఫీషియల్.. రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న ఆయన, దీని తరువాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది.

శర్వా 35 టైటిల్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. తన నుండి 2022 ఒకే ఒక జీవితం సినిమా వచ్చింది. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇక ఆతరువాత నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన నుండి ఒక సినిమా వస్తుంది. శర్వా 35 అనే టైటిల్ తోనే ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది.

ఆ ఒక్కటీ అడక్కు నుండి ఓ మేడమ్ అనే పాట రిలీజ్
అల్లరి నరేష్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది పలు సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఈ ఏడాది అప్పుడే మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేసేశాడు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది.