శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.నిజానికి ఈసినిమాను మార్చి 22వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సివచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నుండి ఈమధ్యే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. వినూత్నంగా శ్మశాన వాటికలో ఈటీజర్ ను రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి తగ్గట్టే టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇక మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా రెంట్ కి డబ్బు లేదు అనే పాటను రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ నటుడు రాహుల్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























