
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 198


సలార్ 2 షూటింగ్ ఎప్పుడో చెప్పిన ప్రుథ్వీరాజ్

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ వస్తుంది

పుష్ప2- వైజాగ్ లో పుష్పరాజ్ కు గ్రాండ్ వెల్ కమ్

ఓన్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్

అసిస్టెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నాగచైతన్య

NBK109 పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్

నాని-వేణు మూవీ టైటిల్ కన్ఫామ్ చేసిన దిల్ రాజు

లవ్ మీ టీజర్ రిలీజ్

ఆ ఒక్కటీ అడక్కు.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తుండగా.. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సలార్ 2 షూటింగ్ ఎప్పుడో చెప్పిన ప్రుథ్వీరాజ్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ గత ఏడాది చివర్లో విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈసినిమా 600కోట్ల వరకు రాబట్టింది.దీనికి సీక్వెల్ కూడా రానున్నడడంతో సలార్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.శౌర్యంగపర్వం పేరుతో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుందని ఫస్ట్ పార్ట్ లో నటించిన బాబీ సింహ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. తాజాగా మరోసారి షూటింగ్ గురించి అప్డేట్ వచ్చింది.ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్రలో కనిపించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అతి త్వరలో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుందని ఓ సినిమా ప్రమోషన్ లో తెలిపాడు.దాంతో ఏప్రిల్ లో షూటింగ్…

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న గామి.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో భారీ ఓపెనింగ్ సాధించింది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ మౌత్ టాక్ స్ప్రెడ్ బాగా కలిసొచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌రియన్స్ ఇస్తోందని ఇలా ఈ చిత్రంపై చాలా ప్రశంసలు వస్తున్నాయి.

ఫ్యామిలీ స్టార్ సెకండ్ సింగిల్ వస్తుంది
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షూటింగ్ జరుగుతుంది.రీసెంట్ గా ఈసినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి సాంగ్ నందనందనా రిలీజ్ చేయగా దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా విడుదలకానుంది.

చిత్ర పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. 'సత్యం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సూర్యకిరణ్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సూర్యకిరణ్ అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

స్వాగ్ లో మహారాణి రుక్మిణిదేవి గా రీతూవర్మ
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు. స్వాగ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

పుష్ప2- వైజాగ్ లో పుష్పరాజ్ కు గ్రాండ్ వెల్ కమ్
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

ఓన్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్
టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తెరపైనే కాదు వెనుక కూడా కీలక పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా మారారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సాయి తేజ్.. ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు 'విజయ దుర్గ ప్రొడక్షన్స్' అని నామకరణం చేశారు.

డబుల్ ఇస్మార్ట్ టీజర్ పై ఆకాష్ పూరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం.

అసిస్టెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నాగచైతన్య
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో నాగచైతన్య తొలిసారి మత్స్యకారుడిగా ఒక వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తున్నారు. మొదటిసారి ఇలాంటి క్యారక్టర్‌లో కనిపించనుండటంతో చైతన్య కూడా దీనిని ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నారు.

ధనుష్-నాగార్జున మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
మల్టీ స్టారర్ సినిమాలు కామన్ అయిపోయాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే మరొకటి తెరపైకి వస్తుంది. ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

NBK109 పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రేమలు మూవీ తెలుగు రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తో పాటు అందరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

ఓటీటీ లోకి వచ్చేసిన 'ఊరు పేరు భైరవకోన'
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. కావ్య థాపర్ మరియు వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించగా.. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఆసక్తి కలిగించే కథాంశంతో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.

శివరాత్రి సందర్భంగా.. కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'భక్త కన్నప్ప' సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు మంచు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది.

గామి మూవీ రివ్యూ-సరికొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ వండర్
ఓవరాల్ గా చెప్పాలంటే గామి సినిమా చూసిన ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని ఇస్తుందన్న సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ఈసినిమాను చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

నాని-వేణు మూవీ టైటిల్ కన్ఫామ్ చేసిన దిల్ రాజు
న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇంకా సుజీత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

ఓం భీమ్ బుష్ ఫస్ట్ సాంగ్ బ్యాంగ్ బ్రోస్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఎప్పుడూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. అంతేకాదు అప్పుడప్పుడు కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీస్తూ కూడా నవ్విస్తుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి నవ్వులు పంచడానికి వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. వీరిద్దరి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా సినిమా వచ్చింది. ఇప్పుడు త్రయం మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు.

లవ్ మీ టీజర్ రిలీజ్
రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. రీసెంట్ గానే టైటిల్ ను ప్రకటించారు. లవ్ మీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ ను చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.