ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను దుల్లగొట్టింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక ఈసినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈమేరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి8వ తేదీన ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. తాజాగా యూఎస్ కలెక్షన్స్ కు సంబంధించి అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. యూఎస్ఏలో ఈసినిమా 5.3 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసుకుంది. అంటే మన కరెన్సీ ప్రకారం ఈసినిమా అక్కడ 44 కోట్ల భారీ గ్రాస్ ను సొంతం చేసుకుంది.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: