ఆ ఒక్కటీ అడక్కు నుండి ఓ మేడమ్ అనే పాట రిలీజ్

oh madam song out from Aa Okkati Adakku movie

అల్లరి నరేష్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది పలు సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఈ ఏడాది అప్పుడే మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేసేశాడు.
మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు. ఓ మేడమ్ అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈపాటకు భాస్కర్ భట్ల సంగీతం అందించారు. పాట అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =