అఫీషియల్.. రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్‌

RC16 Team Welcomes Janhvi Kapoor on Board For Ram Charan's Project

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న ఆయన, దీని తరువాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (శివన్న) ఇప్పటికే ఇందులో నటిస్తుండగా.. తాజాగా ఈ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ చేయబోయే నటి పేరు బయటకు వచ్చింది. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ #RC16లో కథానాయికగా నటించనుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా నేడు అధికారికంగా వెల్లడించారు. ఈరోజు జాన్వీ కపూర్‌ జన్మదినం సందర్భంగా.. ఆమెకు స్వాగతం పలుకుతూ ఎక్స్‌లో మూవీ టీమ్ స్పెషల్ పోస్ట్ పెట్టింది. కాగా జాన్వీ కపూర్‌.. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

ఇక #RC16 సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేయనున్నారు. కాగా రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మరియు #RC16 చిత్రాలు రెండూ భారీ ప్రాజెక్టులు కావడం, అందునా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో మెగా అభిమానులు వీటికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుండగా.. #RC16 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 20 =