తండ్రైన టాలీవుడ్ హీరో శర్వానంద్

hero sharwanand blessed with a baby girl

టాలీవుడ్ హీరో శర్వానంద్ గత ఏడాది వివాహబంధం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్‌ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో శర్వా వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు శర్వా మరో కొత్త బాధ్యతలోకి అడుగుపెట్టాడు. శర్వా పుట్టినరోజు సందర్బంగా ఒక గుడ్ న్యూస్ ను అందరితో పంచుకున్నాడు. తను తండ్రైనట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్బంగా తాను, భార్య ఇంకా పాప ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. అంతేకాదు పేరు ను అప్పుడే ప్రకటించేశాడు. పాపకు లీలా దేవి అనే పేరును పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా శర్వా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే సినిమా వస్తుంది. ఇంకా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వా 36సినిమా వస్తుంది. ఈసినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలానే శర్వా 37 మూవీ సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =