సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.గత నెలలో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈసినిమా ఇప్పటివరకు 4.9 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది దాంతో ఈ ఏడాది అత్యధిక వ్యూస్ ను సాధించిన మొదటి సౌత్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.దీని తరువాత స్థానంలో4.2 మిలియన్ వ్యూస్ తో హాయ్ నాన్న ఉండగా సలార్ 3.5మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో కొనసాగుతుంది.అయితే సలార్ సౌత్ వెర్షన్ లు మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వున్నాయి.హిందీ వెర్షన్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది దాంతో తక్కువ వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది లేకుంటే మొదటి స్థానంలో ఉండేది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుంది యానిమల్.ఈసినిమా జనవరిలో స్ట్రీమింగ్ లోకి రాగ ఇప్పటివరకు 13.6మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.అలాగే షారుక్ ఖాన్ డంకీ 10.8మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంను కైవసం చేసుకుంది.ఈజాబితాలో గుంటూరు కారం 4వ స్థానం లో కొనసాగుతుండగా హాయ్ నాన్న ,సలార్ తరువాతి స్థానాల్లో వున్నాయి.
నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే ప్రస్తుతం డంకీ మొదటి స్థానంలో ఉండగా యానిమల్ రెండో స్థానం లో వుంది.గుంటూరు కారం హిందీ వెర్షన్ 6వస్థానంలో ఉండగా తెలుగు వెర్షన్ 8వ స్థానం లో వుంది.గుంటూరు కారం లాగే హాయ్ నాన్న హిందీ వెర్షన్ హాయ్ పాపకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమా స్ట్రీమింగ్ అయినప్పటి నుండి టాప్ 10లో ట్రెండింగ్ లో కొనసాగుకుంటూ వచ్చింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: