యంగ్ హీరో శర్వానంద్ నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. తన నుండి 2022 ఒకే ఒక జీవితం సినిమా వచ్చింది. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇక ఆతరువాత నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన నుండి ఒక సినిమా వస్తుంది. శర్వా 35 అనే టైటిల్ తోనే ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలామైంది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాకు మనమే అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ అయితే మనమే అంటూ వచ్చే సూపర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటుంది. ఇక పోస్టర్ లో శర్వా, పక్కన చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: