
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 35


కాజల్ అగర్వాల్ కలరిపయట్టు ప్రాక్టీస్ వీడియో

దర్శకుడు ప్రశాంత్ నీల్ పై శృతి హాసన్ ప్రశంసలు

#NTR31 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

సంక్రాంతి బరిలో వారసుడు

సూర్య 42 మేకర్స్ వార్నింగ్

శ్రీ విష్ణు కొత్త సినిమా ప్రారంభం

స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్

ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ అప్ డేట్

మహేష్ తో సినిమాపై నాగ్ రియాక్షన్

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్

కృష్ణంరాజు-ప్రభాస్ సేమ్ టు సేమ్

తనయ సితార కు మహేష్ బాబు డాటర్స్ డే శుభాకాంక్షలు

అనంతపురంలో గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్

సెన్సార్ పూర్తిచేసుకున్న ది ఘోస్ట్

400 కోట్లకు చేరువలో బ్రహ్మాస్త్ర

న్యూ ప్రాజెక్ట్స్ ఎంపిక లో బిజీగా పూజా హెగ్డే

కృష్ణ వ్రింద విహారి హిలేరియస్ బ్లాక్ బస్టర్ -3 డేస్ కలెక్షన్స్
మొత్తానికి నాగశౌర్య తన కొత్త సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. గత శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా ఒకటి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈసినిమా. అందుకే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఈసినిమా మూడు రోజుల్లో 8కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. దసరా ఎంటర్ టైనర్, హిలేరియస్…

కాజల్ అగర్వాల్ కలరిపయట్టు ప్రాక్టీస్ వీడియో
లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. కాజల్ తన కుమారుడు నీల్ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు.ఇండియన్ 2 మూవీ లో కాజల్ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే.

దర్శకుడు ప్రశాంత్ నీల్ పై శృతి హాసన్ ప్రశంసలు
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న #NBK107 , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA 154 మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

#NTR31 మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTR31 మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సంక్రాంతి బరిలో వారసుడు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సూర్య 42 మేకర్స్ వార్నింగ్
పెద్ద పెద్ద సినిమాలకు లీక్లు తప్పవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరకంగా లీక్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా లీక్లు తప్పలేదు. ఆ సినిమా మరేదో కాదు. సూర్య 42 సినిమా. డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా రూపొందుతుంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా మోషన్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

శ్రీ విష్ణు కొత్త సినిమా ప్రారంభం
టాలెండెట్ హీరో శ్రీ విష్ణు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. ఇక రీసెంట్ గానే అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించేశాడు. శ్రీవిష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు.

స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్
బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు గణేష్. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలలో స్పీడ్ పెంచారు . ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ పాటలు విడుదలై ఆకట్టుకోగా తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఓరి దేవుడా . ! మూవీ సెకండ్ సింగిల్ అవుననవా గ్లింప్స్ రిలీజ్
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపాల గోపాల మూవీ లో పవన్ కళ్యాణ్ దేవుడిగా అలరిస్తే , ఈ మూవీ లో దేవుడిగా ప్రేక్షకులను అలరించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి అల్లు శిరీష్ సినిమా రిలీజ్ కు టైమ్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న ఈసినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ముందు నుండి అనుకుంటున్నట్టే ప్రేమ కాదంట సినిమాకు టైటిల్ ను మార్చారు. రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. అయితే ఈసినిమా కరోనా వల్ల బ్రేక్ పడుతూ వచ్చింది. నిజానికి ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయింది. కానీ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనుకుంటున్న తరుణంలో ఈసినిమా…

రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ అప్ డేట్
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్ , రేణు దేశాయ్ , అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మహేష్ తో సినిమాపై నాగ్ రియాక్షన్
ఈ ఏడాది బంగార్రాజు, బ్రహ్మస్త్ర సినిమాలతో మంచి హిట్లను అందుకున్న నాగార్జున ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు హీరోగా నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలుఉన్నాయి. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అంతా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

కృష్ణంరాజు-ప్రభాస్ సేమ్ టు సేమ్
అలనాటి సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు రీసెంట్ గానే మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఈయన తుది శ్వాస విడిచారు. దీంతో ప్రభాస్ కుటుంబం మాత్రమే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమ కూడా శోకంలో మునిగిపోయింది. ఆయన అంతిమక్రియలకు కూడా అభిమానగణంతో పాటు సినీరాజకీయ ప్రముఖులు ఎంతోమంది పాల్గొన్నారు కూడా.

తనయ సితార కు మహేష్ బాబు డాటర్స్ డే శుభాకాంక్షలు
బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #SSMB28 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక కాగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. డాటర్స్ డే సందర్భంగా మహేష్ బాబు తన తనయ సితార కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతపురంలో గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మెగా ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న ది ఘోస్ట్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, వేగం సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ లతో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈకార్యక్రమానికి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని…

అల్లూరి కి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

400 కోట్లకు చేరువలో బ్రహ్మాస్త్ర
కొంత కాలంగా డల్ అయిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు బ్రహ్మాస్త్ర వల్ల కాస్త ఊరట లభించినట్టయింది. చాలా కాలంగా బాలీవుడ్ సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. దానికి తోడు బాయ్ కట్ అనే ట్రెండ్ ఒకటి. దాని ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయితే ఈసినిమా వాటన్నింటిని తట్టుకొని సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని చోట్ల మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా.. కొన్ని చోట్ల మాత్రం పాజిటివ్ టాక్ ను…

న్యూ ప్రాజెక్ట్స్ ఎంపిక లో బిజీగా పూజా హెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కా జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ,పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ దసరా పండగ తరువాత ప్రారంభం అయ్యే సెకండ్ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.