400 కోట్లకు చేరువలో బ్రహ్మాస్త్ర

Brahmastra Movie Close To 400 Crores Club,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Latest collections Updates,Brahmastra Movie Close To 400 Crores,Brahmastra Movie Close to 400 Crores Club,Brahmastra Movie Latest Collections Updates,Brahmastra Movie Nearing to 400 Crores,Brahmastra Movie Lateste Updates,Ranbir Kapoor and Alia Bhatt Super Hit Movie Brahmastra Close to 400 Crores

కొంత కాలంగా డల్ అయిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు బ్రహ్మాస్త్ర వల్ల కాస్త ఊరట లభించినట్టయింది. చాలా కాలంగా బాలీవుడ్ సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. దానికి తోడు బాయ్ కట్ అనే ట్రెండ్ ఒకటి. దాని ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయితే ఈసినిమా వాటన్నింటిని తట్టుకొని సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని చోట్ల మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా.. కొన్ని చోట్ల మాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల‌తో ముందుకు దూసుకుపోతోంది. రీసెంట్ గానే 300 కోట్ల క్లబ్ లో చేరింది ఈసినిమా. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అయితే 300 కోట్లకు చేరువలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది.

కాగా  ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =