సెన్సార్ పూర్తిచేసుకున్న ది ఘోస్ట్

Nagarjuna The Ghost Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,The Ghost,The Ghost Telugu Movie,The Ghost Movie,The Ghost Movie Latest Updates,The Ghost Movie Completes Censor Formalities,Akkineni Nagarjuna,Nagarjuna,Nagarjuna The Ghost Movie Updates,Nagarjuna The Ghost Movie Competes Censor Formalities,The Ghost Nagarjuna Upcoming Movie Completes Censor Formalities,Nagarjuna New Movie Updates,Nagarjuna Upcoming Projects,King Nagarjuna New Movie Updates,King Nagarjuna Upcoming Movie The Ghost completes Censor Formalities

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, వేగం సాంగ్, తమహాగనే థీమ్ సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ లతో ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈకార్యక్రమానికి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ముఖ్యఅతిథులుగా హాజరు కాబోతున్నారు. దీంతో ఈ వేడుక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు నేడు జరుగగా మూవీకి యు/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ సభ్యులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 2 =