సూర్య 42 మేకర్స్ వార్నింగ్

#Suriya42 makers warn pirates, Suriya42 makers warn pirates, Suriya 42, pirates, Suriya42 makers, #Suriya42Movie, Suriya Sivakumar Suriya42, Suriya 42 Update, Suriya 42 Movie Update, Suriya 42 Telugu Movie New Update, Suriya Sivakumar, Hero Suriya, Suriya42 New Update, Suriya42 Movie Updates, Suriya42 Telugu Movie Updates, Suriya42 Telugu Movie Live Updates, Suriya42 Latest News And Updates, #Suriya42, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

పెద్ద పెద్ద సినిమాలకు లీక్లు తప్పవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరకంగా లీక్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా లీక్లు తప్పలేదు. ఆ సినిమా మరేదో కాదు. సూర్య 42 సినిమా. డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా రూపొందుతుంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా మోషన్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి తాజాగా లొకేషన్స్ నుండి స్టిల్స్ లీక్ అయ్యాయి. దీనిపై చిత్రయూనిట్ స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చింది. సూర్య సినిమా నుండి పలు స్టిల్స్, వీడియోలు లీక్ అయినట్టు తెలిసింది.. ఏ సినిమా అయినా ప్రతిభాగం ఎన్నో వందల మంది చెమటా, రక్తం చిందించి మరీ చేస్తుంటారు.. మేము ఈసనిమా చూసే ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగించాలనుకుంటున్నాం.. మీరు లీక్ చేసిన వాటిని తొలగించండి.. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

కాాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =