భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మెగా ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబరు 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ మైదానంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది.
ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. ఈసినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: