
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 13

అవతార్ 2 మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

హీరోలందరికీ ఇష్టమైన హీరోను నేను

హీరో నాగశౌర్య న్యూ మూవీ అనౌన్స్ మెంట్

వారసుడు ఫస్ట్ సింగిల్ అప్ డేట్

సర్దార్ హిట్- డైరెక్టర్ కు గిఫ్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం కల - జాన్వీ కపూర్

రిలీజ్ అయిన HIT 2 మూవీ టీజర్

300 కోట్ల క్లబ్ లో చేరిన కాంతార

పుష్ప2 ముందు యాక్షన్ బ్లాక్ షూట్

గీతా ఆర్ట్స్ నుండి మరో పాన్ ఇండియా మూవీ

హిట్ 2 టీజర్ టైమ్ ఫిక్స్

ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

యూఎస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ కు చేరువలో కాంతార

యూఎస్‌లో హీరో నిఖిల్‌కు సత్కారం

ఇండియన్ 2 లో క్రికెటర్ ఫాదర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింప్లిసిటీ

తమన్నాకి చెస్ నేర్పుతున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. స్టార్ హీరోయిన్ తమన్నా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అవతార్ 2 మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్
బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీస్ ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల కలెక్షన్స్ ను స్వంతం చేసుకున్న విషయం తెలిసిందే.

హీరోలందరికీ ఇష్టమైన హీరోను నేను
శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఇక డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠతతో ఆకట్టుకునే…

హీరో నాగశౌర్య న్యూ మూవీ అనౌన్స్ మెంట్
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య, షిర్లే సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ షిర్లే సెటియా ఈ సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చేశారు. నాగశౌర్య , షిర్లే ల స్క్రీన్ కెమిస్ట్రీ…

వారసుడు ఫస్ట్ సింగిల్ అప్ డేట్
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

సర్దార్ హిట్- డైరెక్టర్ కు గిఫ్ట్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విరుమాన్, పొన్నియన్ సెల్వన్ రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ సినిమా వచ్చింది. ఈసినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేశాడు. ఈసినిమాలో నీటి విలువని తెలియజేశారు మేకర్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం కల - జాన్వీ కపూర్
సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కథానాయికగా తెరకెక్కిన మిలి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

రిలీజ్ అయిన HIT 2 మూవీ టీజర్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT - ది ఫస్ట్ కేస్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. అగ్రెస్సివ్ పోలీస్ గా అతని డైలాగ్ డెలివరీ మేనరిజం తో విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు HIT - ది సెకండ్ కేస్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

300 కోట్ల క్లబ్ లో చేరిన కాంతార
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పుష్ప2 ముందు యాక్షన్ బ్లాక్ షూట్
ఒక సినిమా మొదటి పార్ట్ సక్సెస్ అవుతుండటంతో మేకర్స్ రెండో పార్ట్ తీయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక అందులో పుష్ప2 సినిమా కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప.. ది బిగినింగ్. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సాధించిందో చూశాం. ఇప్పుడు పుష్ప..ది రూల్ వస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో సినిమాని భారీ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్.

గీతా ఆర్ట్స్ నుండి మరో పాన్ ఇండియా మూవీ
టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థల్లో గీతా ఆర్స్ట్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల నుండి ఈ సంస్థ టాప్ లోనే కొనసాగుతూ వస్తుంది. దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ కు సినిమాలపై ఉన్న పట్టు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అలా గీతా ఆర్స్ట్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక డైరెక్ట్ గా తెలుగు సినిమాలను నిర్మించడంతో పాటు డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే కన్నడలో సూపర్ హిట్ అయిన కాంతార సినిమా హక్కులను సొంతం చేసుకొని తెలుగు లో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈసినిమా సూపర్…

హిట్ 2 టీజర్ టైమ్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విజయాలు చూస్తేనే అర్థమవుతుంది తన కథల ఎంపిక ఎలా ఉంటుందో. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా వరుసగా విభిన్నమైన కథలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అడివి శేష్ నుండి రాబోతున్న సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ హిట్ 2 రాబోతుంది. ఇక మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఈసినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించే నటుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ లో చేసిన తనపాత్రకు ఎలాంటి ప్రశంసలు దక్కాయో తెలిసిందే. అలానే బాలీవుడ్ లో రామ సేతు సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించగా అది రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈసినిమాలో సత్యదేవ్ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

యూఎస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ కు చేరువలో కాంతార
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది - ఫరియా అబ్దుల్లా
బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ఫరియా , ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో అతిథి పాత్రలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫరియా తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫరియా ప్రస్తుతం రావణాసుర , వల్లి మెయిల్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

యూఎస్‌లో హీరో నిఖిల్‌కు సత్కారం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్…

ఇండియన్ 2 లో క్రికెటర్ ఫాదర్
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

విష్ణు విశాల్ మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇప్పటికే ఆ రూట్ లో వెళుతున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. రవితేజ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై ఇతర హీరోలతో సినిమాలను కూడా చేస్తున్నాడు. అందులో త్వరలో వస్తున్న సినిమా మట్టికుస్తీ. గతంలో విష్ణు విశాల్ ఎఫ్‌ఐఆర్ సినిమాను తెలుగులో రవితేజ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింప్లిసిటీ
నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ప్రభుత్వం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్‌కుమార్ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

సాంగ్ చిత్రీకరణలో వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.