హీరోలందరికీ ఇష్టమైన హీరోను నేను

Adivi Sesh superb speech at HIT 2 Teaser Launch, HIT 2 Teaser Launch, Adivi Sesh superb speech, The Second Part Of The HIT Verse Looks Much Thrilling, HIT 2 Teaser Released, HIT 2 Telugu Teaser Released, Adivi Sesh, Nani, Meenakshi, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 Movie, HIT 2 Update, HIT 2 New Update, HIT 2 Latest Update, HIT 2 Movie Updates, HIT 2 Telugu Movie, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie New Update, HIT 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా “HIT”. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఇక డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠతతో ఆకట్టుకునే విధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ.. హీరోలంతా ఇష్టపడే హీరోను నేను అని తెలిపాడు. నేను ‘క్షణం’ సినిమా చేసినప్పుడు అందరికంటే ముందు బన్నీ స్పందించాడు. ఆయన అందించిన సపోర్టును ఎప్పటికీ మరిచిపోలేనిది. ఇక ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ పెట్టుకున్న థియేటర్ మహేష్ బాబుగారిది. ఆయన ‘క్షణం’ టీజర్ లాంచ్ చేయడమే కాదు .. నాతో ‘మేజర్’ సినిమాను నిర్మించారు” అన్నాడు. ఇక నాకు ఇష్టమైన హీరో నాని. నా ‘గూఢచారి’ ట్రైలర్ ను .. ‘ఎవరు’ ట్రైలర్ ను తనే లాంచ్ చేశారు. ఇక ట్రైలర్స్ లాంచ్ చేయడం కాదు .. నీతో ఒక సినిమానే చేస్తాను అంటూ ‘హిట్ 2’ సినిమాను నిర్మించారు. అలా హీరోలందరి సపోర్టు .. ఒక మంచి సినిమా చేయాలనే తపనే నన్ను ఇంతదూరం తీసుకుని వచ్చాయి. కంటెంట్ పరంగా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. ఈ సినిమాలో ఆర్య అనే పాత్రలో మీనాక్షి నటిస్తోంది. ఇక విలక్షణ నటుడు రావు రమేష్ కూడా నటిస్తున్నాడు. అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్‌ నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్నాడు. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =