ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇప్పటికే ఆ రూట్ లో వెళుతున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. రవితేజ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై ఇతర హీరోలతో సినిమాలను కూడా చేస్తున్నాడు. అందులో త్వరలో వస్తున్న సినిమా మట్టికుస్తీ. గతంలో విష్ణు విశాల్ ఎఫ్‌ఐఆర్ సినిమాను తెలుగులో రవితేజ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు చల్లా అయ్యవు దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు. ఇక ఇప్పుడు ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కుస్తీ పోటీలో భాగంగా బరిలోకి దిగుతూ ఈ పోస్టర్ లో విష్ణు విశాల్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.
Here’s Presenting the #MattiKusthi First Look!
Best wishes to my dear @TheVishnuVishal & Our super talented team😊 Looking forward to bringing this to all of you soon👍🏻#AishwaryaLekshmi @ChellaAyyavu @RTTeamWorks @VVStudioz @itswetha14 @srinu10477 @vindhyareddi @sridharthestar pic.twitter.com/IuWJxbIvuI
— Ravi Teja (@RaviTeja_offl) November 2, 2022
కాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడీయోస్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌లపై విష్ణు విశాల్, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇది రెండో సినిమా. ఈసినిమాకు వీరిద్దరికి మంచి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: