సర్దార్ హిట్- డైరెక్టర్ కు గిఫ్ట్

sardar producer gifted car to director PS Mithran, director PS Mithran, sardar producer gifted car to director, sardar producer gift to director PS Mithran, Sardar Latest Collections, Sardar Collections, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khanna, Rajisha Vijayan, P.S. Mithran, Sardar Movie, Sardar Update, Sardar New Update, Sardar Latest Update, Sardar Movie Updates, Sardar Telugu Movie, Sardar Telugu Movie Latest News, Sardar Telugu Movie Live Updates, Sardar Telugu Movie New Update, Sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విరుమాన్, పొన్నియన్ సెల్వన్ రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ సినిమా వచ్చింది. ఈసినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేశాడు. ఈసినిమాలో నీటి విలువని తెలియజేశారు మేకర్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ తరువాత స్క్రీన్స్ పెరిగాయంటేనే చెప్పొచ్చు ఈసినిమా ఎంత సక్సెస్ అయిందో. ఇక ఈసినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఇంకా ముందు ముందు కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది నిర్మాతకు దీంతో ఈ సినిమా నిర్మాత ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ దర్శకుడు పీఎస్ మిత్రన్‌కు కారును బహుమతిగా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కారు తాళాన్ని హీరో కార్తీ చేతుల మీదుగా డైరెక్టర్‌కు అందించారు.

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. “ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే” అంటూ సర్దార్‌ సీక్వెల్ ను ప్రకటించారు. కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మించారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రజీషా విజయన్‌, లైలా, యోగి సేతు, మునీష్కాంత్‌, మాస్టర్‌ రిత్విక్‌, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.