ఒక సినిమా మొదటి పార్ట్ సక్సెస్ అవుతుండటంతో మేకర్స్ రెండో పార్ట్ తీయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక అందులో పుష్ప2 సినిమా కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప.. ది బిగినింగ్. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సాధించిందో చూశాం. ఇప్పుడు పుష్ప..ది రూల్ వస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో సినిమాని భారీ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కు డేట్ ను కూడా ఫిక్స్ చేసిన్నట్టు తెలుస్తుంది. నవంబర్ 13వ తేదీన ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. అయితే తాజా సమాచారం మొదట యాక్షన్ బ్లాక్ ను పూర్తి చేయాలని చూస్తున్నారట. ఒక భారీ యాక్షన్ సీన్ ను ముందు షూట్ చేయలాని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈసినిమా థాయిలాండ్ నేపథ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: