
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 85


హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్

రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ హీరో

"ఆదిపురుష్ "మూవీ పై ఆసక్తికర న్యూస్

మరో బాలీవుడ్ మూవీ లో రష్మిక

డబ్బింగ్ పనుల్లో 'హనుమాన్'

ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ దిశగా "ఆర్ ఆర్ ఆర్ "

'లైగర్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'మైక్ టైసన్'

ఉగాది తరువాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ

కెరీర్ లోనే "ఆదిపురుష్ "మూవీ ప్రత్యేకం - ప్రభాస్

'టైగర్ నాగేశ్వరరావు' కోసం మరో హీరోయిన్..!

అనుపమ లేటెస్ట్ లుక్

"ఆర్ ఆర్ ఆర్ "యూనిట్ కు రామ్ చరణ్ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అభిమానులే స్ట్రెంగ్త్ &ఇన్ స్పిరేషన్ -అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం…

హీరో నితిన్ న్యూ మూవీ ప్రారంభం
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఎమ్ ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మాచర్ల నియోజకవర్గం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతిశెట్టి , క్యాథరిన్ కథానాయికలు.. ఏప్రిల్ 3 వ తేదీ నితిన్ హీరోగా తెరకెక్కే కొత్త మూవీ ప్రారంభం అయ్యింది.

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ జరగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు.

'అల్లు అయాన్' కి బన్నీ ఎమోషనల్ బర్త్ డే విషెస్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన టైమ్ కూడా ఇస్తాడు. అందుకే టాలీవుడ్ లో ఉన్న ఫ్యామిలీ పర్సన్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా మొదటి వరుసలో ఉంటాడు. తన పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి తను కూడా అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు వారి వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు కూడా అల్లు అర్జున్ అలానే సతీమణి స్నేహా రెడ్డి. ఇక అల్లు అయాన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈసందర్భంగా అల్లు అర్జున్ తనయుడికి బర్త్ డే విషెస్ అందించాడు. నా లవ్ అల్లు అయాన్ హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను…

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్
మన సౌత్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మన సినిమాలను చాలా వరకూ ఆక్కడ రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇక ఈనేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయినా ఫైనల్ గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయగా…

రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ హీరో
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, అజయ్ దేవగన్ “రన్ వే 34”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'బీస్ట్' ట్రైలర్
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తెలుగులో కూడా ఆయన నటించే సినిమాలకు సాలిడ్ కలెక్షన్స్ వస్తుంటాయి. కొన్ని సినిమాలు అయితే 100 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టినవి ఉన్నాయి. ఇక ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బీస్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈసినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. చెన్నైలోని ఓ మాల్ ని…

"ఆదిపురుష్ "మూవీ పై ఆసక్తికర న్యూస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మరో బాలీవుడ్ మూవీ లో రష్మిక
దక్షిణాది భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం ""పుష్ప :ది రూల్ ", బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ "పుష్ప :ది రైజ్ " హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

డబ్బింగ్ పనుల్లో 'హనుమాన్'
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు హనుమాన్ రెండో సినిమా చేస్తున్నారు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు తీయడానికి ప్రయత్నించే ప్రశాంత్ వర్మ మొదటి సారి ఈసినిమాతో సూపర్ హీరోస్ నేపథ్యంతో వస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఇక తేజ సజ్జ తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈసినిమా పనులను కూడా వీలైనంత త్వరగా…

ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ దిశగా "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

'లైగర్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'మైక్ టైసన్'
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. తాజాగా మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక మైక్ టైసన్ కూడా ఈ విషయాన్ని చెబుతూ.. డబ్బింగ్ డన్.. నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

అనుష్క శెట్టి- నవీన్ పొలిశెట్టి సినిమా షూటింగ్ అప్ డేట్..!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. . సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

'ఆర్ఆర్ఆర్'.. వారం రోజుల్లో 710 కోట్లు..!
కొన్ని సినిమాలు సినిమా రిలీజ్ అయిన తరువాత రికార్డులు క్రియేట్ చేస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు మాత్రం సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ తోనే సంచలనాలు సృష్టించింది ఈసినిమా. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. ఎన్నో అంచనాల మధ్య మార్చి 25న రిలీజ్ అయిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా చాలా మంది ఈసినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో…

ఉగాది తరువాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ
బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

కెరీర్ లోనే "ఆదిపురుష్ "మూవీ ప్రత్యేకం - ప్రభాస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

'టైగర్ నాగేశ్వరరావు' కోసం మరో హీరోయిన్..!
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా పాన్ ఇండియా దిశగా అడుగువేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆహీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈసినిమాతో మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే అప్పుడే సందడి మొదలైంది. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు అదే…

అనుపమ లేటెస్ట్ లుక్
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ”, "బటర్ ఫ్లై " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

సీనియర్ ద ర్శకుడు శరత్ మృతి పట్ల బాలకృష్ణ తీవ్ర సంతాపం
సుమన్ , భానుప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "చాదస్తపు మొగుడు " మూవీ తో శరత్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుమారు 20 సినిమాలకు శరత్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సుమన్ , బాలకృష్ణ లతో సూపర్ హిట్స్ అందుకున్నారు.హీరో బాలక్రిష్ణతో "వంశానికి ఒక్కడు", "పెద్దన్నయ్య", "సుల్తాన్", "వంశోద్దరకుడు", సుమన్ తో "చాదస్తపు మొగుడు", "పెద్దింటి అల్లుడు", "బావ-బావమరిది","చిన్నల్లుడు" వంటి సినిమాలు శరత్ తెరకెక్కించారు.