కొన్ని సినిమాలు సినిమా రిలీజ్ అయిన తరువాత రికార్డులు క్రియేట్ చేస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు మాత్రం సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ తోనే సంచలనాలు సృష్టించింది ఈసినిమా. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. ఎన్నో అంచనాల మధ్య మార్చి 25న రిలీజ్ అయిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా చాలా మంది ఈసినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో రూ.300కోట్లకు పైగా అలానే నార్త్ లో 100 కోట్లకు పైగా ఓవర్సీస్‌లోనూ ఇప్పటివరకు రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ అయి నేటితో ఒక వారం పూర్తయింది. ఇక దీంతో ఈవారం రోజుల్లో ఈసినిమా ఎంతో కలెక్ట్ చేసిందే చిత్రయూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియచేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలిపారు. ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఈసినిమా కలెక్షన్స్ ఇంకా సాలిడ్ గా రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: