రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ

Naga Babu Gives Clarity About Rumours on Niharika Konidela,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naga Babu,Actor Naga Babu,Naga Babu News Updates,Naga Babu Daughter Niharika,Naga Babu About His Daighter,Naga Babu About Niharika,Naga Babu Gives Clarity About Rumours, Niharika Konidela,Rumours on Niharika,Niharika in Rave Party,Niharkia in Pub

బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో రేవ్ పార్టీ జరగడం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో నిహారిక ఉండటం, పోలీసుస్టేషన్‌కు తరలించిన వ్యవహారంపై నాగబాబు స్పందించారు. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారనీ , అనుమానాలకు తావివ్వకుండా తాను స్పందిస్తున్నాననీ , నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దనీ నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్‌కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. పబ్‌లో పాల్గొన్న99 మంది యువకులు, 33 మంది యువతుల అడ్రస్‌లు, ఇంటి నెంబర్‌లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.