టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ టెక్నాలజీ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “ఆదిపురుష్ “మూవీ విశేషాలను దర్శకుడు ఓం రౌత్ పంచుకున్నారు. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సన్నివేశాలు హైలైట్ గా ఉండనున్నాయనీ , ఈ సినిమాలో.. రాముడి పరాక్రమ శైలిని హైలైట్ చేస్తున్నామనీ , ఈ కథ తనపై ఎంతగానో ప్రభావాన్ని చూపిందనీ , “ఆది పురుష్” మూవీ షూటింగ్ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేననీ , ప్రభాస్..సైఫ్ అలీఖాన్ లాంటి ఇద్దరి స్టార్ హీరోలతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందనీ , ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారనీ , రాముడి పాత్రలోకి ప్రభాస్ పరకాయ ప్రవేశం చేశారనీ , ప్రభాస్ డౌన్ టూ ఎర్త్ పర్సన్ అనీ , సెట్ లో అందరిని సమానంగా చూస్తారనీ , అతనిలో ఆ లక్షణం తనకు ఎంతగానో నచ్చిందనీ ఓం రౌత్ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























