రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరెట్ హీరో

Actress Rakul Preet Singh Reveals Her Favourite Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Actress Rakul Preet Singh,Rakul Preet Singh latest Movie,Rakul Preet Singh Upcoming Movie Updates,Rakul Preet Singh latest Movie News,Rakul Preet Singh New movie, Rakul Preet Singh About Her Favourite Hero,Rakul Preet Singh Reveals her Favourite Hero,Rakul Preet Singh Favourite Hero,Rakul Preet Singh Favourite Hero Allu Arjun, Rakul Preet Singh in Social Media,Rakul Preet Singh in Instagram,Rakul Preet Singh Photos and Videos in Instagram Goes Viral,Rakul Preet Singh Latest Updates

తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, అజయ్‌ దేవగన్‌ “రన్ వే 34”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకుల్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ఫొటో షూట్స్ ఫొటోలను తమన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.తాజాగా రకుల్ ఇన్ స్టాగ్రామ్‌లో తన అభిమానులు, ఫాలోవ‌ర్ల‌తో క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్స్ సెష‌న్‌లో పాల్గొన్నారు. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని రకుల్ చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ , రకుల్ జంటగా తెరకెక్కిన “సరైనోడు ” మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో అల్లు అర్జున్ , రకుల్ తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 8 =