సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ‘బీస్ట్’ ట్రైలర్

Beast Movie creates new records,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Beast,Beast Movie,Beast Movie Updates,Beast Creates Records,Beast Tamil Movie,Beast movie Creates New Records,Beast Sensational Records, Beast Movie Trailer,Beast Trailers Creates Records,Beast Movie Trailer Creates Record in 24hrs,Beast Movie Trailer 30millions Views in 24hrs and 2.2 Million Likes, Vijay Beast Movie Trailer,Vijay Beast Movie Trailer Creates a Record,Hero Vijay Beast Movie Updates

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తెలుగులో కూడా ఆయన నటించే సినిమాలకు సాలిడ్ కలెక్షన్స్ వస్తుంటాయి. కొన్ని సినిమాలు అయితే 100 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టినవి ఉన్నాయి. ఇక ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బీస్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈసినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ విజయ్ రాఘవన్ గా రంగంలోకి దిగుతాడు విజయ్. ఈ నేపథ్యంలోనే ఈసినిమా నడుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు.. ఈ ట్రైలర్ కొత్త రికార్డులను సైతం సృష్టించింది. 24 గంటల్లో ఈ ట్రైలర్ 30 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇంకా 2.22 మిలియన్ లైక్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన అరబిక్ కుతు సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 255 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే సెకండ్ సాంగ్ జాలియా జింఖానా కూడా భారీ వ్యూస్ ను సాధిస్తుంది. మరి ఏప్రిల్ 14న కె.జి.యఫ్2 సినిమా రిలీజ్ కాబోతుంది. చూడబోతే ఈసినిమా కె.జి.యఫ్ 2 కి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది.

కాగా యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాాగా ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =