హిందీ ‘జెర్సీ’ ట్రైలర్ రిలీజ్

Jersey Movie Hindi Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shaid Kapoor,Hero Shaid Kapoor Movie Updates,Shaid Kapoor Latest Movie News,Shaid kapoor Jersey Movie Latest Updates,Jersey Movie Trailer,Jersey Movie Trailer Released, Jersey Movie Trailer Out,Jersey Trailer,Shahid Kapoor’s upcoming film Jersey,Jersey Movie Hindi Trailer,Jersey Movie Hindi Movie Trailer Released,Jersey Movie Hindi movie Trailer Out

మన సౌత్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మన సినిమాలను చాలా వరకూ ఆక్కడ రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇక ఈనేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయినా ఫైనల్ గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయగా.. పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈసినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈసినిమాలో షాహిద్ కు జోడీగా మృణాళిని ఠాకూర్ నటిస్తుంది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ, శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈసినిమాను హిందీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =