డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. తాజాగా మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక మైక్ టైసన్ కూడా ఈ విషయాన్ని చెబుతూ.. డబ్బింగ్ డన్.. నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: