అనుష్క శెట్టి- నవీన్ పొలిశెట్టి సినిమా షూటింగ్ అప్ డేట్..!

Anushka Shetty And Naveen Polishetty New Movie Shoot To Begin from April 4th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Anushka Shetty,Naveen Polishetty,Anushka Shetty Latest Movie Updates,Actress Anushka Shetty New Movie News,Naveen Polishetty Upcoming Movie News,Naveen Polishetty Latest Movie With Anushka Shetty,,Naveen Polishetty New Movie Updates,Anushka Shetty Team Up with Naveen Polishetty For New Movie

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. . సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ తో కలిసి సినిమా చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ డేట్ ను ఫిక్స్ చేశారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో అనుష్క శెట్టి కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =