డబ్బింగ్ పనుల్లో ‘హనుమాన్’

Teja Sajjas Hanuman Movie Dubbing Works Underway,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Teja Sajja,Hero Teja Sajja Upcoming Movie,Teja Sajja Telugu Movie News,Teja Sajja Movie Updates,Teja Sajja Hanuman Movie Updates,Teja Sajja Dubbing For Hanuman Movie, Teja Sajja Latest Movie Updates,Teja Sajja New Movie News,Director Prasanth Varma Movie Hanuman,Teja Sajja with Director Prasanth Varma Hanuman Movie

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు హనుమాన్ రెండో సినిమా చేస్తున్నారు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు తీయడానికి ప్రయత్నించే ప్రశాంత్ వర్మ మొదటి సారి ఈసినిమాతో సూపర్ హీరోస్ నేపథ్యంతో వస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఇక తేజ సజ్జ తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈసినిమా పనులను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =