
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 75


ప్రముఖ నిర్మాత 'నారాయణ్ దాస్ నారంగ్' కన్నుమూత

“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్

బాలీవుడ్ లో "ఆర్ ఆర్ ఆర్ "రికార్డ్

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీపై హీరో రామ్ ప్రశంసలు

'బూట్ కట్ బాలరాజు' సోహైల్ బర్త్ డే గ్లింప్స్..!

"ఆచార్య "మూవీ పై దర్శకుడు కొరటాల స్పందన

"శాకుంతలం"మూవీ డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

'అంటే సుందరానికి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

'హిట్' హిందీ రీమేక్.. షూటింగ్ కంప్లీట్..!

సూపర్ స్టైలిష్ "స్పై"

"#NTR 30 " మూవీ అప్ డేట్

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

'సలార్' షూటింగ్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్

500 కోట్ల క్లబ్ లో "కె జి ఎఫ్ చాప్టర్ 2"

శాండల్ వుడ్ లో "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ న్యూ రికార్డ్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కన్నడచిత్ర పరిశ్రమలో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలిచింది. ఒకప్పుడు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కే కన్నడ సినిమాల రూపు రేఖలను దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్చేశారు.

ప్రముఖ నిర్మాత 'నారాయణ్ దాస్ నారంగ్' కన్నుమూత
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో పలు విషాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో కరోనా వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను అలానే వయసు పైబడిన వారు ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతో మందిని కోల్పోయింది సినీ పరిశ్రమ. ఇక ఈ ఏడాది ప్రారంభమైన నాలుగునెలల్లోనే పలువురు సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక విషాదం నుండి కోలుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంటుంది. ఇటీవలే సీనియర్ కథానాయకుడు బాలయ్య మరణించగా అది మరిచిపోకముందో మరో ప్రముఖ నిర్మాత మరణించిన ఘటన చోటుచేసుకుంది.

'తెలుగు ఫిలిం నగర్' ట్విట్టర్ కు 1 మిలియన్ ప్రేమ..!
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఇక సోషల్ మీడియా వేదికగా ఉన్న ట్విట్టర్, ఇన్ట్సా, ఫేస్ బుక్, యూ ట్యూబ్ వీటి హవా ఇప్పుడు నడుస్తుంది. అందుకే ఏ పరిశ్రమ అయినా సరే తమ మార్కెట్ పరంగా వీటిని కూడా ఉపయోగిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్స్ కు ఇవే ప్రధాన మార్గాలు. ప్రేక్షకులకు ఏ వార్త అయినా చేరవేయాలంటే వారథిలాగా పనిచేస్తుంటాయి. అలాంటి ఒక వారధే తెలుగు ఫిలిం నగర్ కూడా. ఇప్పటికే ది తెలుగుఫిలింనగర్.కామ్ అనే పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను ఇస్తుంటుంది తెలుగు ఫిలింనగర్.

'సర్కారు వారి పాట' మహేష్ మాస్ బ్లాస్ట్..!
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఇటీవలే తెలిపింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆపాటను కూడా పూర్తిచేసే పనిలో పడింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మాస్ సాంగ్ కు హీరో హీరోయిన్లు మహేష్ బాబు, కీర్తీ సురేష్ స్టెప్పులేస్తున్నారు. ఇక ఈపాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం…

“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్
శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య , సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లీ సేఠియా జంటగా తెరకెక్కిన “కృష్ణ వ్రింద విహారి" మూవీ మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్ , సత్య , బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు.

నెల గ్యాప్ లో 2 మల్టీ స్టారర్స్ తో రామ్ చరణ్ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

'ఆచార్య' భలే భలే బంజారా సాంగ్ రిలీజ్..!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. చిరు తనయుడు.. టాలీవుడ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు చరణ్. దీంతో ఈసినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈనెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాట మాత్రం భలే భలే బంజారా…

'అశోక వనంలో అర్జున కళ్యాణం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది. ఇటీవలే ఏప్రిల్ 22న రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 6వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు…

బాలీవుడ్ లో "ఆర్ ఆర్ ఆర్ "రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీపై హీరో రామ్ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ…

'బూట్ కట్ బాలరాజు' సోహైల్ బర్త్ డే గ్లింప్స్..!
బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు సోహెల్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సోహైల్. ఇక బిగ్ బాస్ తరువాత వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకూ సోహైల్ నటించినా సినిమాల్లో ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. రూప కొదువయూర్ దర్శకత్వంలో సోహెల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కానుంది.

"ఆచార్య "మూవీ పై దర్శకుడు కొరటాల స్పందన
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. "ఆచార్య " మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను…

"శాకుంతలం"మూవీ డబ్బింగ్ పూర్తి చేసిన సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెర కెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'అంటే సుందరానికి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
న్యాచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈసినిమా. ఈ సినిమాను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. ఇటీవలే నాని పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా…

'హిట్' హిందీ రీమేక్.. షూటింగ్ కంప్లీట్..!
మన తెలుగు సినిమాలకు ఇప్పుడు హిందీలో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తున్నాం. ఇక్కడ హిట్ అయిన సినిమాలను దాదాపు నార్త్ లో కూడా రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు రీమేక్ అయ్యాయి. దీనిలో భాగంగానే తెలుగులో సూపర్ హిట్ అయిన హిట్ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టైలిష్ "స్పై"
ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "గూఢచారి ", "ఎవరు ", "హిట్ "మూవీస్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ దసరాకు పాన్ ఇండియామూవీ గా రిలీజ్ కానుంది. హీరో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్యా మీనన్ నటిస్తున్నారు. అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ ముఖ్యపాత్రాలలో నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

"#NTR 30 " మూవీ అప్ డేట్
ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య. ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.

'సలార్' షూటింగ్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు మేకర్స్. నిజానికి ఆదిపురుష్ కంటే కూడా ఈసినిమానే ముందు షూటింగ్ పూర్తిచేసుకోవాలి. కానీ మధ్యలో బ్రేక్ పడింది. కరోనా వేవ్స్ వల్ల అలానే మధ్యలో ‘రాధే శ్యామ్’ సినిమా కోసం డేట్స్ కేటాయించడం..మరోవైపు బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’ కోసం ముంబైలో లాక్ అవడం..ఇలా పలు కారణాల వల్ల ‘సలార్’ చిత్రీకరణ ఆలస్యం అయింది.

500 కోట్ల క్లబ్ లో "కె జి ఎఫ్ చాప్టర్ 2"
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.