డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీని హిందీలో పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. హీరో యష్ “కె జి ఎఫ్ 2”, విజయ్ “బీస్ట్ ” మూవీస్ తో పోటీఉన్నా “ఆర్ ఆర్ ఆర్” మూవీ బాలీవుడ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ తో స్టడీ గా ఉంది. ఇప్పటివరకూ బాలీవుడ్ లో 250 కోట్ల కలెక్షన్స్ తో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ రికార్డ్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























