“కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీపై హీరో రామ్ ప్రశంసలు

Hero Ram praises KGF Chapter 2 movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hero Ram,Hero Ram Pothineni,Hero Ram Pothineni Movie Updates,Hero Ram Pothineni upcoming movies,Hero Ram Pothineni latest Movie Updates,Hero Ram Pothineni New movie Updates, Hero Ram Pothineni Praises KGF Chapter 2 Movie,Ram Praises KGF2 Movie,Hero Ram About KGF Chapter 2 Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టి 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అన్ని భాషల ప్రేక్షకులు “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షక , అభిమానులతో పాటు సినీప్రముఖులు “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీపై ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ పోతినేని సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ ని ప్రశంసించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో వచ్చిన గొప్ప చిత్రాల్లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఒకటనీ , సినిమా చూస్తున్నంత సేపు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేననీ , ఈ సందర్భంగా “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ చిత్ర యూనిట్ కి అభినందనలనీ , బ్లాక్ బస్టర్ అవడానికి అన్ని అర్హతలున్న సినిమా “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” అంటూ రామ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − nine =