బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు సోహెల్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సోహైల్. ఇక బిగ్ బాస్ తరువాత వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకూ సోహైల్ నటించినా సినిమాల్లో ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. రూప కొదువయూర్ దర్శకత్వంలో సోహెల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ‘బూట్‌కట్ బాలరాజు’ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక నేడు సోహైల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి బర్త్ డే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గ్లింప్స్ ను చూస్తుంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్నట్టు అర్థమవుతుంది.
Introducing Our #BootCutBalaraju 🕺 aka @RyanSohel. Wishing him a Happy Birthday.
Watch the Birthday Glimpse
▶️ https://t.co/tKKCZ4PRaH#Meghalekha
Directed by #SreeKoneti
Produced by @BekkemVenugopal
Music by @ceciroleo@luckymediaoff #Globalfilms#HBDSohel pic.twitter.com/O3H4EF8PJ0— LuckyMedia (@luckymediaoff) April 18, 2022
కాగా కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ళ హీరోయిన్ గా నటిస్తుంది. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్‌దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ తదితరులు నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: