ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు మేకర్స్. నిజానికి ఆదిపురుష్ కంటే కూడా ఈసినిమానే ముందు షూటింగ్ పూర్తిచేసుకోవాలి. కానీ మధ్యలో బ్రేక్ పడింది. కరోనా వేవ్స్ వల్ల అలానే మధ్యలో ‘రాధే శ్యామ్’ సినిమా కోసం డేట్స్ కేటాయించడం..మరోవైపు బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’ కోసం ముంబైలో లాక్ అవడం..ఇలా పలు కారణాల వల్ల ‘సలార్’ చిత్రీకరణ ఆలస్యం అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మే 1వ తేదీ నుండి మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారట. మే నుంచి లాంగ్ షెడ్యూల్ నే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రాజెక్ట్ కే షూటింగ్ చేస్తూనే మరోవైపు ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేయనున్నాడట ప్రభాస్.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: