సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సనిమా అవ్వడం దానికి తోడు ఈసినిమాలో మహేష్ మేకోవర్ మార్చి స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇక ఇన్నిరోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమా తాజాగా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటున్నా చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్స్ పార్లల్ గా చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా బ్లాస్టర్ పేరుతో గ్లింప్స్, రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో అందరూ మూడో సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మూడో సాంగ్ మంచి మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట కూడా మంచి మాస్ బీట్ తో ఆకట్టుకుంటుంది. కాగా ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన కళావతి, పెన్నీ సాంగ్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ పాట కూడా అంతకుమించి రెస్పాన్స్ ను సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి చూద్దాం ముందు ముందు ఈపాట ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.
#SVPTitleSong out now!! ⚡https://t.co/yxn7z3X92V #SarkaruVaariPaata#SVPOnMay12
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth
— Parasuram Petla (@ParasuramPetla) April 23, 2022
కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మది సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: